మారిపోయానా?
జ్ఞాపకాలు మోయలేనంత కాదు, రుణం తీర్చలేనంతగా..
నే చూసిన కళ్ళ నుండి నను చూసే కళ్ళవరకూ..
మారిపోయానా?
సొంతింటికి పయనమయ్యి అతిథి అయ్యేంతగా..
సంతోషంలేక,సమయాల సరసన బంధి అయ్యేంతగా..
మారిపోయానా?
స్నేహాల చాటునుండి వేషాలు మార్చలేనంతగా..
ప్రేమల వెనుకబడి లాభాలు వెతికేంతగా...
లేదు లేదు మారిపోలేదు..
కలల సాకారానికి కన్నీళ్ళ వెనుక కష్టాన్ని దాచేసా..
గుర్తొచ్చి కవ్వించు జ్ఞాపకాలు ఎద అంచున ముంచేసా..
నాలోని గతం, భవిష్యత్తుని నిర్మిస్తుంటే ఆ మార్పు మంచిది కాదా?
No comments:
Post a Comment