హాయి వలలో చిక్కుకోకు రేయి కనిపించదు
వలపు చూపుకు వంగిపోకు వంటపడదు
మాయకు మురిసిపోకు మంట తప్పదు
షేక్ హాండ్కు చాచిపోకు షాక్ తప్పదు
ఏది తప్పదో అది నీకు ఒప్పదు
తప్పుకోమంటే కాంతకు నప్పదు
కొట్టుకుపోతుంటే పడతి ప్రవాహంలో
కుటుంబ తీరం కౌగిలించేసింది.
హాయి వలలో చిక్కుకోకు రేయి కనిపించదు
వలపు చూపుకు వంగిపోకు వంటపడదు
మాయకు మురిసిపోకు మంట తప్పదు
షేక్ హాండ్కు చాచిపోకు షాక్ తప్పదు
ఏది తప్పదో అది నీకు ఒప్పదు
తప్పుకోమంటే కాంతకు నప్పదు
కొట్టుకుపోతుంటే పడతి ప్రవాహంలో
కుటుంబ తీరం కౌగిలించేసింది.
(భావన భవానీల తొలిపరిచయం)
ఏమని చెప్పను అల్లరి రాక్షసుల గురించి
ముద్దుగా ఉన్నారంటే మబ్బుల్లో తేలిపోతారు
కిలాడీలు అందామంటే కిల్ చేసిపోతారు
మాటలతో గారడీ చేస్తున్నారు
మనసును మత్తులో ముంచేస్తున్నారు
మాయా చేసినా హాయిగా ఉందే..తాళేదెలా?
ఎటుచూసినా వాళ్ళని చూసే కళ్ళు,
ఆ కనులను దాటి చూపులు కలిపేదెలా?
తగదు మనసా! ఇంతితో ఇంత చనువు..
తెగవు బహుశా! పడతితో పగటి కలలు
ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది ఏదో చెప్పలేని భావన ఉంది నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...