Friday, 29 December 2023

సత్యశ్రీ చెలిమి

 ఎలా మొదలైందో తెలియని తొలి పరిచయం

మౌనం నుండి మాటలు కలిపేదాకా

 దారులలో పాదముద్రలు

షాపింగ్లలో షికారులు,

బొటానికల్ గార్డ్న్ లో ఆహ్లాద సాయంత్రాలు,

సండే మార్కెట్లో సరదా కబుర్లు,

ఢీ మార్ట్లో దాయలేని ఊసులు,

ప్రాజెక్ట్ పరిచయంలో ఎక్కడాలేని ఊహలు,

సెలవు రోజుల్లో చల్లగాలి సన్నాయిలు,

పార్కులలో పరవసించి చేసిన ప్రయాణాలు,

అప్పుడప్పుడూ నిశివేళల దోశెలు,

ఎప్పుడూ ఖాళీ అయ్యే కాఫీ కప్పు గ్లాసులు,

మార్నింగ్ మాకోసం ఎదురు చూపులు,

సాయంత్రాన సరదాగా గడిపిన కాసిన్ని క్షణాలు..

సరైన పరిచయంలేని నుండి 

"చెత్త రాస్కెల్" దాకా,

ఏం చెప్పాలో తెలియని సమయం నుండి

"చెప్పు అబ్బా" అనేదాకా..ప్రతీదీ

మెదడులో కాదు..మనసులో దాచినవి.

ఛాయాచిత్రాలలో కాదు..సత్యశ్రీ చెలిమిలో దాగినవి

వాళ్ళలానే ఉండు..

చెలిమిలో బలిమి ఒకరు..

          చెలిమిలో చెర మరొకరు..అన్నీ మామూలే.

చెయ్యందించేది ఒకరు..

          చేజార విడిచేది మరొకరు..అన్నీ మామూలే.

నవ్వించేది ఒకరు..

          నవ్వును లాక్కునేది మరొకరు..అన్నీ మామూలే.

నమ్మకం కలిగిస్తారు ఒకరు..

          నమ్మేలా నటిస్తారు మరొకరు..అన్నీ మామూలే.

అల్లరి చేసేది ఒకరు..

          అల్లరిపాలు చేసేది మరొకరు..అన్నీ మామూలే.

అన్నిమామూలైనా, మొదటిచోట నీలా ఉండు,

ఎన్నిమామూలైనా, రెండోచోట వాళ్ళలా ఉండు.

స్వేచ్ఛ

 అదుపులేని మంట దహించేస్తుంది,

ఆనకట్టలేని నీరు ముంచేస్తుంది,

ఆవేశపడితే ఆకాశం చుక్కలు చూపిస్తుంది,

కంపిస్తే భూమి భయపెడుతుంది

అలాగే..

అడ్డులేని స్వేచ్ఛ నిన్ను ఇబ్బందుల్లో నెడుతుంది,

నీవారి నమ్మకాన్ని నాశనం చేస్తుంది.

నమ్మకమంటే అంగట్లో సరుకుకాదు మిత్రమా..కొనుక్కురావడానికి,

ఒక్కసారిపోతే నీ జన్మసరిపోదు నమ్మేలా చేయడానికి.

Saturday, 23 December 2023

అమ్మ

ఊబిలో ఉంటే చివరికొన తాను,

బాధలో ఉంటే భరోసా తాను,

నిద్దురకి జోలపాట తాను,

ఎక్కడున్నా నేనున్నాననేది తాను,

దయనీయ స్థితిలో ధైర్యం తాను,

ఎన్ని కోల్పోయినా నా నమ్మకం తాను,

అన్నివేళలా ఆదరణ తాను,

గుండెల్లో బాధే కాదు,

గోరంత నొప్పి తగిలినా తట్టుకోదు తాను,

ఆకలిలో,చాకలిలో,వాకిలిలో,వేకువలో,

వంటలో,ఓర్పులో,అన్నింటిలో..

ఆకరి శ్వాసవరకూ అమ్మ తాను.

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...