Monday, 24 October 2022

కీప్ స్మైల్ ఆల్వేస్

దగ్గరైయ్యింది నువ్వు కాదా?

ఉసిగొల్పింది నువ్వు కాదా?

తప్పుకు నువు కారణమయి, 

తప్పించుకోవడం ఏల?


క్షమాపన కోరకపోయి,

అటునుంచి క్షమాపన పొందకపోయి,

చెలిమి కొలిమి ముక్కలవ్వదా?


నీవైపు నుండి చూస్తే తప్పుడుకోణం..

వారికంటూ ఉంటుందిగా వ్యక్తిగత జీవితం..

సరిదిద్దగలిగితే చెలిమి చెయ్,

లేదంటే జస్ట్ సే హాయ్ బాయ్..

అంతేగాని ఎవరికోసం చిరునవ్వు దూరం చేసుకోకు.

Sunday, 16 October 2022

మిస్ యూ మ్యూజిక్ క్లాస్

 చిన్నపిల్లలమై వచ్చాము..మీ దగ్గర చిన్నపిల్లలమే..

పెద్దవాళ్లుగా వెళుతున్నాము..మీ పెద్దరికాన్ని ఎప్పుడూ నిలబెట్టేవాళ్ళమే..

ఎన్నో ఊసులు..గురువుల మోటివేషన్ స్పీచులు..

మోర్నింగ్ లేవమనే సాగర ఘోషలు 

అరే.. ఇలా చెప్పేవారుండరనే ఎదలోని బాధలు

ఎప్పుడూ చంద్రుని వయలిన్ గానాలు

ముడిపడిపోయాయి మీతో మా ప్రాణాలు


ఎక్కడికి వెల్లిపోగలం శ్రీధరుని పాలననుంచి

వేరుచేయబడము కదా ఈ మ్యూజిక్ ఛాయలనుంచి


బాధ రావడంలేదు..మా బాధని మీరు మోస్తున్నందుకు

సంతోషంగా ఉంది..మీ సరదాలు మాకు పంచుతున్నందుకు

మిసెస్ శ్రీమతిని మిస్ అయ్యేంతగా మిమ్మల్నందరిని మిస్ అవుతున్నాం

లవ్ కూడా లబో దిబో అనేలా లవ్ యూ ఆల్.

ప్రయత్నం మానకు

 కళ్ళు తెరిస్తే కలల ప్రపంచం

కను మూస్తే కలలో ప్రపంచం

బ్రతికినన్నినాళ్ళు బానిసలాగే బతుకుతావా?

కట్టెకాలేవరకూ కష్టాలతో సాకుతావా?

తాడో పేడో తేల్చేయ్..సమయం పారిపోతుంది.

అయితే కాళిలా రా..లేదా కాలి రా..

కానీ ఖాళీగా రాకు..కనీస ప్రయత్నం మానకు..

మిస్ యూ విలేజ్

 బంధాలను ఒదిలి, బాల్య జ్ఞాపకాలు ఒదిలి,

ఊరిని ఒదిలి, వాడను ఒదిలి,

ఏకాకిగా పయనమవుతున్నా...

కట్టే గూడుకోసం, పొట్టకూటి కోసం,

నా అన్న వారికోసం, నావారి కోసం,

కష్టమైనా కాలు కదుపుతున్నా...

ఊరిలో లోకువో, కలల లోకమో నెట్టేస్తుంటే,

తప్పక తిప్పలు పడుతూ కదిలొస్తున్నా...


హైద్రాబాద్ నగరమా..ఆలకిస్తున్నావా?

భాగ్యనగరమా..బాధ అర్ధమవుతుందా?

నే నడిచిన నేల నావైపు జాలిగా చూస్తుంటే..

నా కన్నీళ్ళతో తన బాధను తూచగలనా..?

నిన్ను చూపించనా...!

 శిఖరం ఏది అంటే నిన్ను చూపిస్తా..

వజ్రం ఏది అంటే నిన్ను చూపిస్తా..

మెరుపు ఎవరు అంటే నిన్ను చూపిస్తా..

మైమరపు ఏదంటే నువ్వేనని చెప్తా..


మరి నరకం ఎటు అంటే నువ్వులేని చోటు అని చూపించనా..?

చీకటేదంటే నువులేని కలే కదా..!

కలే నువులేక కలత చెందితే..

కలకాలం నువులేవని కట్టెకాలే వరకూ ఏడ్వనా?

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...