కుదిరితే గొడవపడు,
లేదంటే బుజ్జగించు,
కానీ మౌనంగా ఉండకు.
నీ మౌనమే మన మధ్యన దూరం,
నీపై నా కోపం కాకూడదుగా ద్వేషం,
నీ స్పర్శకు పులకరించదా తనువు?
నీ తడి కన్నులకు తీరిపోదా తగువు?
స్నేహం కోరితే నువ్వు,
చేయందించనా నేను?
దూరం పెడితే నువ్వు,
దరి చేరనుగా నేను.
గానమై మరిపించు గాయం మానేదాక..
లేదా గాయమై ఉండిపో నీ గుర్తు చెరిగేదాకా..
- దున్సేవర్