Telugu Poetry
Friday, 6 March 2026
ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది
Monday, 8 December 2025
నువ్వు నేను సమానం
Wednesday, 19 November 2025
బంగారం ఆని పిలవని..
Monday, 3 November 2025
Friend ship
Sunday, 28 September 2025
కాలం చాలా దూరం వెళ్లిపోయింది
కాలం చాలా దూరం వెళ్లిపోయింది మిత్రమా...
బాల్యంలోని భయాల నుంచి బాధ్యతలు తెలుసుకునేంతవరకు,
సరదాగా సమయం గడిపేంత నుంచి సమయంలేనింతవరకు,
ప్రతీది అద్భుతమని అనుకునేంత నుంచి అద్భుతాలను సృష్టించేంతవరకు,
కలలో రాకుమారినుంచి, ఇలలో రాకుమారి అనేంతవరకు...
కష్టం ఓ కడయింది,
ఇష్టం ఎక్కడో ఉంది,
అవసరాల కోసం పరుగు పెడుతూ...
అవసరమైనదాన్ని వదులుతూ...
గాయాల గాటును తట్టుకుంటూ,
మోసాలను మౌనంగా భరిస్తూ...
చింతలేదూ, చిగురులేదూ,
రాబోయేదానికి దిగులు లేదూ...
చిరునవ్వుతో ఎదుర్కోవడం తప్పు చేసినది కాదు,
ఏదో కోల్పోయామని బాధపడుతూ ఉంటే అర్థమే లేదు...
ఇంకెంత దూరం మిత్రమా... రెండు అడుగులే...
కష్టానికి నువ్వు *care of address* కాదు,
నీకు నువ్వు నిలబడు చాలు...
నా ఇంటికి నేను దొంగనయ్యాను
నా ఇంటికి నేను దొంగనయ్యాను,
నా రూమ్ కి నేను ద్రోహినయ్యాను,
నా పరుపుకి నేను పట్టని వాడినయ్యాను,
నావాళ్ళకి నేను లోకువయ్యాను,
కన్నీటికీ కారణం తెలియని కారణమయ్యాను.
పోనిలే
కన్నీటి ధారలతో RGUKT హాస్టల్ కి రంగులు పూసా,
ముక్కలైన మనసుతో అతుకులు అద్దా..
నా కలల్లో కన్నీరు మీ దాహాన్ని తీరుస్తుందా సీతాపతి గారు?
నా మనసులో బాధ మీ మనసు నింపిందా బుచ్చిబాబు గారు?
మర్చిపోలేని సన్మానాన్ని కానుకగా ఇచ్చావు,
చేయని తప్పుకు నన్ను బంధి చేసావు.
నన్ను వదిలే RGUKT మిత్రమా...
మరలా కలలో కూడ కలుసుకోను.
హర్షిత చెలిమి
తన అల్లరి ఆకాశమైతే,
ఆటపట్టిస్తే వచ్చే అలక పాతాళం
చిమ్చాంగ్‌గా చేసే చిందులు చెప్పలేనన్ని అయితే,
సరదాగా గడిపే క్షణాలు సముద్రమంత.
అందరినీ అలుకుపోయే ఆమని,
మనసు నిండా మనం అనే భామిని.
మనిషిని తాకే అందం తాను కాకపోవచ్చు,
మనసును తాకే మందారం తాను.
పుడమికి వర్షం ఇచ్చే హర్షం... హర్షిత..
ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది
ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది ఏదో చెప్పలేని భావన ఉంది నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...
-
కాలం చాలా దూరం వెళ్లిపోయింది మిత్రమా... బాల్యంలోని భయాల నుండి బాధ్యతలు తెలుసుకునేంతవరకు, సరదాగా సమయం గడిపేంత నుండి సమయం లేనంతవరకు, ప్రతీదీ అ...
-
నీ మాటల మంత్రాలు గమ్మత్తును తిలకిస్తే… నీ చూపుల హర్షాలు మేనును పులకరిస్తాయి… కవ్వించలేని కాంతవి కావా? కవ్వించలేని కావ్యం కావా? రమణీయమైన రవిక...