అంతుచిక్కని అయోమయంలో ఉన్నప్పుడు,
చిన్న చల్లగాలితో నిద్రపుచ్చుతుంది.
నువ్వు ఏడుస్తూ ఉంటే కన్నీటిని తుడవడానికి
చినుకు చుక్కగా నీ మోమును తాకుతుంది.
పక్షులన్నీ గాలిపటాలైపోతాయి తానొస్తే...
చెట్లన్నీ సంబరపడిపోతాయి తానొస్తే...
కష్టజీవులకి కాస్త విశ్రాంతి, చిరాకు...
చిన్న పిల్లలకి ఆనందం, గంతులాట...
ఆకాశానికి కన్నీళ్లు వస్తే నేలతల్లి సంబరపడిపోతుంది. రేడియోలో సిగ్నల్ లేక వచ్చే శబ్దం,
టీ-పకోడీల కోసం వెతికే సాన్నిహిత్యం.
తనతో గంతులు వేస్తూ ఆనందాన్ని పంచుకోవాలి అనిపించినా...
"లేదురా! నువ్వు పెద్దోడివైపోయావు"
అని గుర్తు చేస్తుంది ఈ వర్షం.
No comments:
Post a Comment