కరగరు ఈ అమ్మాయిలు కవితలకు
పలుకరు ఈ అమ్మాయిలు పాటలకు
మాయలో పడిపోరు ఈ అమ్మాయిలు మాటలకు
వాలు చూపులు చూపనే చూపరు ఈ అమ్మాయిలు నీ సూటిచూపులకు
పొంగిపోరు ఈ అమ్మాయిలు నీ పొగడ్తలకు
నీ వెంట నడుచుకు వచ్చేయరు ఈ అమ్మాయిలు నీ నడకలకు
సంబరపడిపోరు ఈ అమ్మాయిలు నీ సరదా కబుర్లకు
ఆనందభాష్పాలు రాల్చరు ఈ అమ్మాయిలు నీ అడ్డమైన చేష్టలకు
నిజమే ఇవేమీ చేయకపోయినా నీ వలలో పడిపోతారు...
కరిగిపోతారు,పలుకలేక మూగబోతారు
నువు చూపించే బాధ్యతగల ప్రేమకు
నీ మాయలో పడిపోతారు,వారి చూపులతో నడిపిస్తారు
నువ్వు తప్పవేరే లోకం తెలియదన్నప్పుడు,
అలా నువ్వు చెలిమి కలిగి ఉన్నప్పుడు
పొంగిపోతారు,నీ వెంట నడుస్తారు
నీ అడుగుముందు నా అడుగుంది నీకేంకాదన్నప్పుడు,
అలా నడిపించగలిగే స్థోమత ఉన్నప్పుడు
సంబరంతో కన్నీళ్ళు కారుస్తారు
వారు కన్నీళ్ళు పెట్టకుండా చూసుకున్నప్పుడు
కలిసే వరకూ ఈ మట్టిలో తోడుగా వుంటానన్నప్పుడు
అందుకే వారు అమ్మ అయ్యేవారు,అందరినీ అర్ధం చేసుకునేవారు
వారిని గౌరవించకపోయినా పర్వాలేదు,కానీ ఏడిపించకండి,
వారి పట్ల రాక్షసంగా ప్రవర్తించకండి