Tuesday, 30 May 2023

సహనాన్ని గెలకొద్దు

 మాట అంటె పడటానికి,

తిడితే తీయగ తీసుకోవడానికి,

పరిహాసమాడితే పడివుండడానికి,

వాదనకు దిగితే వదిలేయడానికి,

చిరాకు తెప్పించిన సర్ధుకుపోవడానికి,

నేను నీకేమవుతానో ఆలోచించు..

బ్లడ్ రిలేషన్ ఆ..? లేక గుడ్ రిలేషన్ ఆ..?

మౌనంగుంటే మూగోడిని కాదు,

మనసు నొప్పించరాదని మౌనంగున్నా.

స్నేహమంటే కొవ్వొత్తిలా కరిగైనా వెలుగిస్తా..

గేలి చేస్తే మైనంపోసి తగలెడతా.

                                           - దున్సేవర్


Monday, 29 May 2023

నువు ఎవరో నేను ఎవరో

 నేను నలుపే, నీ నేరేడు కళ్ళలో దాయొచ్చుగా..

నేను కొంటె, కొంచెం కొంగుముడి వేయొచ్చుగా..

నేను కరుకే, కమ్మెల్లో కొలువీయొచ్చుగా..

నేను ముదురే, ముక్కెరతో ముడిపెట్టొచ్చుగా..

నాకు పొగరే, పట్టితో పనగట్టొచ్చుగా..

పదునైన కాటుకకు పరవశపడనా?

లేక నల్లని చీకటి కౌగిలికి బాదపడనా?

నే కార్చె ప్రతి కన్నీటి చుక్క,నీ కాలికి మువ్వలైతే సంతోషంగా ఏడుస్తా..

ఎరుపెక్కిన కళ్ళలో కాంతితో కలకాలం ఎదురుచూపే..

నువు ఏం కావని తెలిసినా.

                                              - దున్సేవర్

Sunday, 14 May 2023

Mothers Day - 2023

 జీతంలేని పనిమనిషి

కలలను కాలంలో కలిపేసిన కషాయి

ఓపిక చావని చాకలి

పస్తులుండి తీర్చే ఆకలి

కునుకేయక కావలుండే లంకిని

నేరం చేయని జీవిత ఖైదు గృహిని

తన కన్నీటికి ఆనకట్ట వేసి,

కుటుంబ పొలాన్ని పండించే భామిని

                                     - దున్సేవర్


ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...