Saturday, 18 December 2021

Don't follow girls.. follow your goals

పస్తులుండి కడుపునింపినపుడు కనిపించదు ఈ ప్రేమ

పైపై మెరుగుల అందచందాలకు పరుగులు తీస్తుందీ ప్రేమ


ఉరకలువేసే రక్తం ఉన్నపుడు కనిపించదు ఈ ప్రేమ

ఓపికపోయాక అందించే చేయూతలో ఉంటుందీ ప్రేమ


ప్రేమంటె ఏంటి? అనే ప్రశ్నలోలేదీ ప్రేమ

నూరేళ్ళు చల్లగ ఉంటే దొరికే సమాధానం ఈప్రేమ


పరిగెత్తకే మనసా ప్రేమ వెనుక..

దేవదాసువవుతావా మిగిలిపోయి తెర వెనుక.

దిశమార్చకే మనసా గమ్యమొదిలి.

లేనిప్రేమలు పుట్టునుగా కల్గినపుడు నీకు కలిమి....





Thursday, 9 December 2021

Don't stop

 త్వరపడు

కలబడు

నిలబడు

నిలవడు

ఎవ్వరు

ఎప్పుడు


గమనం నీది

గమ్యం నీది

సమయం నీది 

సాధన నీది


ఆశ నీది

శ్వాస నీది

రగిలే గుండెకు రాగం నువ్వే


హోరు నీది

జోరు నీది

పరుగులు తీసే తుఫాను నువ్వే


ఒదలకు ఏదీ - దొరికేవరకూ

ఓటమి లేదు - కాటికెళ్ళేవరకూ

ఏది చేసినా - ఎంత చేసినా

ఎవరు ఆపినా - ఎచట ఆగినా


గెలుపు దాగునా రాతలలోనా?

ప్రయత్నమాపిన ఫలము వచ్చునా?




ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...