ఎదలోని బాధ
ఏమిటి రాత్రిలో కూడా ఇంత వెలుగొచ్చింది అనుకున్నా
చంద్రబింబం వంటి నీ ముఖం కారణమని తెలుసుకున్నా
రైలులా వేగంగా దూసుకెళ్తున్నా ననుకున్నా
నా ముందు పట్టాలేసింది నువ్వేనని తెలుసుకున్నా
కలకాలం నాతో ఉంటావని నేను అనుకున్నా
ఇంతలో బ్రేకుప్ అని పాకప్ చెప్తావని ఊహించలేదు
నా గుండె చప్పుడులో 'లబ్' అంటే నువ్వని, ‘దబ్’ అంటే నేనని
సదా నీ తర్వాతే నేనని, నీతోనే ఉంటానని అనుకున్నా
నా ఎద సవ్వడిలో నువ్వేలేవని అంటావని అనుకోలేదు
ఇలా రవి కాంతి వెదజల్లుతూ నా జీవితంలోకి వచ్చావు
వెనుదిరిగి వెంటనే నిసి నొదిలి వెళ్ళావు
ఊపిరి
ఆగేలోపైనా చిరు శ్వాసనైనా నాకు ఇవ్వకపోతావా…?
వర్షించే
జల్లువై నా కొరకు రాకపోతావా…?
అని వేచిచూస్తూ…………..
రచన
B.Durgababu
