Sunday, 6 August 2023

నా చెలి మనసు మంచు

(నోట్ : ఎరుపు వర్ణం అబ్బాయి,నీలం వర్ణం అమ్మాయి పలికే వాక్యాలు)

నా చెలి మనసు మంచు,

మంచుకింద ఏమి దాగుందో..?

నా చెలి అర్ధంకాని పద్యం,

ఆ పద్యం వెనుకు ఎన్ని అర్ధాలు దాగాయో..?

నా చెలి ఓ పాల్కడలి,

కడలిలో ఏ ఉప్పెన దాగుందో..?

అన్ని దాగిన నీలో,నేను దాగిలేనా?

                                         -దున్శేవర్

నేరేడు కళ్ళ నెరజాణ

నేరేడు కళ్ళ నెరజాణ నావైపు ఎందుకు చూస్తుంది?

సొగసైన సిరిమల్లె నాకెందుకు చిక్కుతుంది?

సుగంధాల గంధమై నన్నెందుకు తగలెడుతుంది?

పాల్కడలి చిలికిన పాలకోవ మైమరపేల తెస్తుంది?

రివ్వున ఎగిరే గువ్వయితే బాదకాదా?

పరవశపడితే పలుకురాదా?

కలవరపెట్టే కాంతతో కష్టం కాదా?

మనసిమ్మని అడిగేంత ఇష్టం లేదా?

పరిణయం వస్తుందో..ప్రళయం వస్తుందో..

మనసున దాగిన మాట మగువను చేరుకోగా..

అప్పటివరకూ..

మనోవేదన తప్పదు బహుశా...

                                          -దున్శేవర్


Thursday, 3 August 2023

నగుమోము శశి

నల్లని మబ్బులవెనుక దాగిన నగుమోము శశి,

కల కలిగిన కళ్ళకు రాశావా నిసి,

నీ నవ్వుకు పరిహారం ముత్యాలహారమైతే,

కనుబొమ్మల కంచెకు సదా దాసోహం.

చెరసాల కడుతుంటే చెక్కిలాలు,

చెలిఖైదు చేస్తున్నవే చెర్రీ పెదాలు.

మెడనున్న హంస మనసున విహరిస్తు ఉంటె,

చెవికమ్మెలు గుండెలో గంట కొడుతుంటే,

గారాబంగా గాజులు గాయపరుస్తుంటే,

గజినీగ నను చేసిన నీ రూపు గమ్మత్తు.

కనుతిరగనంటుంది కాసేపు పక్కకు,

నీ మాయకు మెడిసన్ ఏది మగువా...!

                                          -దున్శేవర్

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...