Wednesday, 16 November 2022

చిన్న స్మల్

ఏ కనుదిష్టి తగిలి నా చందమామ మబ్బులవెనుక దాగిందో..
ఏ మాటకు నొచ్చుకొని చెలి చిలక గుబురులో దాగిందో..
ఏ గాలి సోకి నా ఊపిరి గాలికి ఊచలు లెక్కపెట్టిస్తుందో..
ఏ మాయమాటలకు మోసపోయి మదన పడుతుందో..

నన్ను బాధపెట్టే నిర్లక్షదోరణికి చరమగీతం పాడేది లేదా?
ఏం చేస్తే అలకపంజరం వీడతావో సెలవిచ్చేది లేదా?
నీ కోపాగ్నికి హారతై ఆహుతి అయిపోతానేమో!
చిన్న స్మల్ ఇస్తే హారతవ్వనా!(దిష్టితీయనా).

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...