1.Video Done
నువ్వాగిపోవచ్చు,కానీ కాలం ఆగిపోదు.
కాలం తనేంటో రుచిచూపించక ముందే
నువ్వేంటో కాలానికి నిరూపించు.
2.Video Done
ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది "నీపై నీకు నమ్మకం".
బహుశా అందుకేనేమో జెర్రీ చేతిలో టోం ఎన్నిసార్లు ఓడిపోయినా తిరిగి ప్రయత్నిస్తూనే ఉంటుంది, ఒక్కసారైనా గెలవకపోతానా అని.
3.
నీలో షేడ్(talent) ప్రపంచానికి తెలియాలంటే...
ఒకటి నీ కళ్ళ కింద షేడ్(Hard work) ఉండాలి.
లేదా నోట్ల షేడ్ కింద(money) నువ్వుండాలి
4.
లవ్ ఉంటే లైఫ్ ఉండదు...
లైఫ్ ఉంటే లవ్ ఉండదు...
అందుకే ఎవరూ లేని ఒంటరి ప్రపంచానికి వెలిపోతున్నా..
5.
You have to hunt the world
Otherwise world will hunt you
6.
Run until you die
Don't die without doing any try.
7.Video done
కాకులు దూరని కారడవి కన్నా,
చీమలు దూరని చిట్టడవి కన్నా,
నా చెలి మనసు ఇరుకైనది.
అందుకేనేమో తన మనసులో నాకు స్థానంలేదు.
8.Done
పోయినదాని గూర్చి ఆలోచించకు - తిరిగిరాదు.
వచ్చినదాని గూర్చి ఆలోచించు - పోతేరాదు.
9.
అవసరం ఏదైనా చేయిస్తుంది
వ్యసనం ఏదైనా పోగొడుతుంది
10.struggle is like Google.
It gives problem and solution also.
11.
రాక్షసబల్లిలో 'బల్లి' ఉంది కదా అని చిన్నదనుకోకు...
పక్కన రాక్షసం కూడా ఉంది.
12.
ప్రపంచాన్ని చుట్టిరావడానికి కావాల్సింది రెండు కళ్ళు కావు.ఒక్క మనసు.ఎందుకంటే
కలుపుకుంటూపోతే ప్రపంచాన్ని చూస్తావ్...
కళ్ళెర్రజేసుకుంటూపోతే ప్రపంచంలో లేకుండా పోతావ్...
13.
కల కంటే కళాకారులం కాము
కళ ఉంటే కళాకారులం అవుతాము.
14.
దోచే ప్రతీదీ దాచలేము,
దాచే ప్రతీదీ దోచుకోలేము.
15.
దరిచేర్చే ప్రతీదీ దారికాదు,
దారిచ్చే ప్రతీదీ దరికి చేర్చలేదు.
16.
ప్రపంచం చుట్టూ నువు తిరుగుతావా? లేక
ప్రపంచాన్ని నీ చుట్టూ తిప్పుకుంటావా?
17.
కన్నీరు దాయి నీలో ఉన్న వేడితో మరగబెట్టి నిను హేళన చేసిన వారిపై పోద్దుగాని.
నిన్ను చీదరించుకున్న వారిపేరు రాయి వారి చేత్తోనే నీ పేరు రాసేలా చేద్దూగాని.
నీపై పడిన ప్రతీరాయి నీ అడుగుకు పునాది
ఓటమిని చూసి ప్రయత్నానికి కట్టకు సమాధి
ఇంకెందుకు లేటు? గెలుపు కోసం పదా..ఓ పిసినారి..
18.
నువు మాట్లాడే ప్రతి పలుకు ఒక పిడుగవ్వాలి లేదా
బడుగు జీవులకొక అండవ్వాలి
నువు చూసే ప్రతి చూపు కత్తవ్వాలి లేదా
చల్లని వెన్నెలవ్వాలి
నువు వేసే ప్రతి అడుగు నూతనానికి నాంది అవ్వాలి లేదా
నడిపే వారధవ్వాలి
నమ్మకంతో నువు వేసే ప్రతి అడుగుకి అడ్డమే..
ఎదురుకోక తప్పదు ఒక మహా యుద్ధమే.
19
నేను ప్రజల్లో మనిషిని,
ప్రజల పై మనిషినిగాను.
20
నీ ఆశయం గొప్పదైతే ప్రతి నెత్తుటి చుక్క నాట్యమాడదా?
21.
వరం పొందడం సులువు కాదు.
వరం ఇచ్చే ఈశ్వరుడు కూడా తన వరాన్ని తిరిగి తీసుకోలేడు.
అందుకే అడిగే వరం ఆనందాన్ని ఇచ్చేదై ఉండాలి.
22
తెల్లని కాగితంపై నల్లని మచ్చని మాత్రమే చూస్తున్నావు కాని,కాగితమంతా నీకు కనిపించలేదా..? ఆ తెలుపే నేను..దీనిని ఇంకోలా చెప్పమంటావా? ఒకసారి ఒకరి మనసుపై చేసే గాయం సర్పెక్షల్ పెట్టి ఉతికినా పోగొట్టలేవు..
23.Done
నిద్రపోడానికి 'జో' కొట్టరు కానీ,
నిద్రచెడగొట్టడానికి ముందుంటారుగా అమ్మాయిలు..
24.
ఆధునికత ఆమని అందాన్ని పెంచాలేకానీ,
అవహేళన చేసేలా కాదు.
నూతనం వస్త్రాలకా వనితకా కావాల్సింది?
25.
జాజిమల్లె అల్లినట్టు మస్తుగా ఉన్నావ్..
మనసునంత నింపే మల్లెలా ఉన్నావ్..
నువ్వో నారికేళపాకం...
26.
సముద్రమంత ప్రేమ ఇస్తానన్నా
బయటికి ఎగసిపడే అలలు చూసి బయపడితే ఎలా?
27
సాయం చేసే మనిషి ఉన్నప్పుడు సమయం ఎలా తెలియదో
సరిగ్గాలేని మనుషులతో సమయం అలానే గడవదు
28
కలలు పరుగెడుతుంటే...
కాంత కవ్విస్తుంటే...
కవితెలా రాసేదే కాలమా..
29.
కొండను కొట్టాలంటే ముందు బండను కొట్టాలి,
దానికి కన్నా ముందు నీ గుండెను తట్టాలి...
మరి నువ్వు సిద్ధమా..
30.
తగ్గి ఉండమని అనడం లేదు,
తనువుకు దూరంగా ఉండొద్దు అంటున్నా...
31.
కష్టమైైనా కావాల్సిన వారి కోసం తప్పదు,
స్వర్గమైనా నచ్చని వారితో ఒప్పదు...
32.
పండగంటే పది మందిలో ఉండటం కాదు,
పది మంది మనసులో ఉండటం.
33.
దేవదాసువవుతావా..? దేశ ప్రగతి సాధిస్తావా..?
34.
నిసి అనే ప్రశ్నకు నీలో కసే సమాధానం
35.
నలుగురు మనుషులు కుటుంబం కాదు...
నాలుగు నవ్వులే కదా కుటుంబం.
36.
దేశం కోసం కార్చే ప్రతి బొట్టు తిలకమే సైనికా...
37.
వెన్నులో దమ్ము కాదు,
గుండెలో దమ్మున్న వాడే నాగలి పట్టేది.
38.
నేనేదో కాలాన్ని గెలిచేద్దామనుకొని పరుగెత్తడం లేదు...
నా కాలంలో నువ్వుండాలని పరుగు పెడుతున్నా.
39.
నేను వెన్న దొంగనో, జేబు దొంగనో కాదు...
మనసు దొంగని, ఎందుకంటే నీ మనసు దోచాలిగా
40.
తెంచుకుంటూ పోతే ఎంత బలమైన తాడైనా తెగిపోదా...
పంచుకుంటూ పోతే దారమల్లీనా మాలవదా...
41.
కష్టంలో నీకు కార్మికుడిని కానా?
ఇన్ని అయినా నీకు నేనేమీ కానా?
నీకు ఏమి కాని నేను శూన్యమ్ము కానా...!?