Sunday, 4 June 2023

అమ్మాయిల మౌనం

 మీ కోసం ఎంత దూరమైనా వచ్చే మేము,

మీరన్న చిన్న మాట దగ్గరే ఆగిపోతాము.

జీవితంలో ఏ కష్టానికి బ్లాక్ అవ్వని మేము,

మీవల్ల చిన్న బాధ కల్గిన అన్ బ్లాక్ కాలేము,

కానివాళ్ళు కార్చిచ్చు పెట్టినా నీటి గీతే

అయినవాళ్ళ నీటి గీతే కాదా,ఎదపై రాతే

మీ కన్నీటి సుడిగుండంలో కొట్టుకుపోయినా సంతోషమే

మీ కోపపు చూపులకు కాలిపోయినా ఆనందమే

వీడని మీ మౌనం కన్నా..

మగువలు,

మా మనసుకు గాయం చేసేది మీరే,

గాయానికి మందు రాసేది మీరే,

మా చిరుకోపాన్ని ద్వేషంగా మలచకండి,

ఏం కానివాళ్ళం ఖచ్చితంగా అయిపోతాం కరడుకట్టి

                                                 - దున్సేవర్

No comments:

Post a Comment

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...