Saturday, 23 May 2026

Distance makes difference - సిరి

Distance makes difference అంటారు.....
ఆకాశం అంటుంది అంటా...
ఆ మబ్బులాగే నీ ప్రేమ వస్తూ ఉంటాది మళ్ళీ పోతుంటాది అని....
మేఘం అంటాది అంటా నువ్వు ఎప్పుడు ఒకేలాగా ప్రేమిస్తావేమో కానీ నేను ఎక్కువ ఆనందం వస్తే మేఘమై కమ్ముకుంటా...
ఎక్కువ బాధ వస్తే వర్షమై కన్నీరు కారుస్తా....
The difference of love ఇదేనేమో....

​నీ ప్రేమ కోసం - సిరి

​నా గుండె నడుగు నీ కోసం నా గుండె కొట్టుకోని క్షణం లేదు
నా చెవులను అడుగు నీ పేరు వినగానే ఆనంద పడని రోజు లేదు
నా కనులు అడుగు నువ్వు కనిపిస్తే బాగుండు అనుకోని క్షణం లేదు
నేను పడుకునే దిండు అడుగు నీకోసం ఏడవని రోజు లేదు
నువ్వు ఎక్కడ నాకు దూరం అయిపోతే నేను ఉండలేను ఏమో అని...
ఇవన్నీటికి కారణం ప్రేమే అయితే....
నువ్వు నాకు కావాలి
ప్రతి రోజు.. ప్రతి క్షణం.. లైఫ్ టైమ్.
ఇట్లా ప్రేమించే అమ్మాయి లేకపోవచ్చు, 
నీకోసం ఏమైనా చేస్తా అని అమ్మాయినే నేను.

Saturday, 9 May 2026

ఈ వర్షం

అంతుచిక్కని అయోమయంలో ఉన్నప్పుడు,

చిన్న చల్లగాలితో నిద్రపుచ్చుతుంది. 

నువ్వు ఏడుస్తూ ఉంటే కన్నీటిని తుడవడానికి

చినుకు చుక్కగా నీ మోమును తాకుతుంది. 

పక్షులన్నీ గాలిపటాలైపోతాయి తానొస్తే... 

చెట్లన్నీ సంబరపడిపోతాయి తానొస్తే...

​కష్టజీవులకి కాస్త విశ్రాంతి, చిరాకు... 

చిన్న పిల్లలకి ఆనందం, గంతులాట...

ఆకాశానికి కన్నీళ్లు వస్తే నేలతల్లి సంబరపడిపోతుంది. రేడియోలో సిగ్నల్ లేక వచ్చే శబ్దం, 

టీ-పకోడీల కోసం వెతికే సాన్నిహిత్యం.

​తనతో గంతులు వేస్తూ ఆనందాన్ని పంచుకోవాలి అనిపించినా... 

"లేదురా! నువ్వు పెద్దోడివైపోయావు" 

అని గుర్తు చేస్తుంది ఈ వర్షం.

Tuesday, 5 May 2026

పక్కోడి జీవితం..

పక్కోడి జీవితంపై ఎప్పుడు ఆశ చావదు
నీ జీవితాన్ని సరిదిద్దుకునే చావలేదు
పక్కోడి స్టేటస్ నీకు కావాలి
వాడి చేసేది ఆపడానికి అప్డేట్ కావాలి
నువ్వు మంచోడివి అనుకుంటే ముంచే గుణం ఉంది 
నమ్మితే నమ్మినందుకు ఎసరు పెట్టే ఏడుపు ఉంది
పక్కోడి మీద జోక్ వేసి నవ్వుకోవాలి
తోటి వాడిన అవమానించి శాడిజం పొందాలి 
పక్కోడు ఎదగకూడదు 
నీకన్నా స్కిల్ ఎక్కువ ఉండకూడదు
నీలాగా పక్కోడు లోన్ లో ఉండాలి
లేదంటే లాప్టాప్ ముందు వేసుకొని లోన్లీగా ఉండాలి 
వెధవ 
సుంట
మూర్ఖుడా
నీ పని ఏదో నువ్వు చూసుకో ఎందుకు దొబ్బుతావ్ 
ఊరికే...

Saturday, 2 May 2026

పరిగెత్తు..

పరిగెత్తు
ఏడ్చిన ప్రతిసారి పరిగెత్తు 
నిన్ను చూసి జాలిపడిన ప్రతిసారి పరిగెత్తు 
ఓడిపోతానన్న  ప్రతిసారి పరిగెత్తు అలాగే పడిపోయిన ప్రతిసారి లేచి పరిగెత్తు 
ఆయాస పడుతున్నావా? మిత్రమా...
నీ కన్నీరు నీ కలలన్నిటినీ మోసే నదీ ప్రవాహం కదా 
జాలి వెనుక నీ పతనాన్ని కోరుకునే మనుషుల గురించి నీకు తెలియదా? ఓటమి గెలుపుకి తొలిమెట్టు కాదా? పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు అని నీవు వినలేదా?
మరి ఇంకెలా ఆయాసం?
ఆలోచించి పరిగెత్తు..
కొన్ని కోట్ల ఆలోచనలు కట్టడి చేసే మనిషివి నువ్వు.
ఆగిపోతే ఎలా?
పదా మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టు...

Distance makes difference - సిరి

Distance makes difference అంటారు..... ఆకాశం అంటుంది అంటా... ఆ మబ్బులాగే నీ ప్రేమ వస్తూ ఉంటాది మళ్ళీ పోతుంటాది అని.... మేఘం అంటాది అంటా నువ్...