ఏదో చెప్పలేని భావన ఉంది
నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో
లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో
మారం చేసి తెచ్చుకోలేను
అలాగని గారం చేసి కొనలేను
కొన్నిసార్లు మోయలేనంత భారం ఇస్తావ్
కొన్నిసార్లు మైమరిపించే అంత మైకానిస్తావ్.
నాకలాన్ని తాక్కని అలజడి నువ్వు
నా మనసును తాకే సవ్వడి నువ్వు
కలవవుతున్నావో
కవిత్వమవుతున్నావో
సమయం ఇవ్వవు
సమాధానం ఇవ్వవు
సంధిగ్ధంలో పడేసి సతమతం చేస్తావ్ ఏంటి ప్రేమ...