ఎందుకు పరిగెడుతున్నానో తెలీదు,
దేన్ని అన్వేషిస్తున్నానో అర్ధం కాదు,
ఏదో కావాలి..
ఏదో సాధించాలి..
మనసుకు నచ్చింది చెయ్యాలని మనసులో ఉన్నా..
మనతో ఉన్నోళ్ళు ఇబ్బంది పడకూడదని మనసు చంపుతున్నా..
వాడికేంట్రా జాబ్ చేస్తున్నాడు అని అందరూ అన్నా..
జాబ్ తప్ప నేనేం చేస్తున్నాను? అనే ప్రశ్న నాలో ఉంది..
కలల్ని కాలంలో కలిపేసి,
కష్టపడాలి అనే ముసుగులో ఇష్టపడటాన్ని ఎప్పుడో మానేశా..
కాసేపు కబుర్లు చెప్పే మనుషులు లేక,
మనసువిప్పి మాట్లాడే సమయం లేక,
పరిగెత్తే వయసు కోసమో.. లేక,
పనికిరాకుండా పోతానేమో అనే భయం కోసమో,
నిత్యం నాతో నేను చేసే యుద్ధం.
జీవితంతో నేను ఆడే దాగుడుమూతలు.
Friday, 29 March 2024
ఎందుకు పరిగెడుతున్నానో తెలీదు
అల్లరి చేసినా..
అల్లరి చేసినా,
చిలిపిగా ఆటపట్టించినా,
కవిత్వాన్ని వెదజల్లినా,
కాస్త కోపం చూపినా,
మన అన్న వాళ్ళతోనే..
మన వాళ్ళతోనే..కానీ..
విలువలేనివారికి విలువనిచ్చి,
గాయం చేసే చోట గమ్మత్తు నీకు అవసరమా?
చనువులేని చోట తనువు ఉన్నా,
తగని తేనెపూత విషము కాదా?
మాయచేసే చోట మోసపోతావా?
హక్కు ఉన్నదని హద్దు మీరతావా?
గత గాయాల గుర్తులు చెరగక ముందే.
వద్దన్న చోట కాక, నువ్వున్న చోట
వెలుగు పంచు ఓసి వెర్రి మనసా..!
Subscribe to:
Comments (Atom)
ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది
ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది ఏదో చెప్పలేని భావన ఉంది నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...
-
కాలం చాలా దూరం వెళ్లిపోయింది మిత్రమా... బాల్యంలోని భయాల నుండి బాధ్యతలు తెలుసుకునేంతవరకు, సరదాగా సమయం గడిపేంత నుండి సమయం లేనంతవరకు, ప్రతీదీ అ...
-
నీ మాటల మంత్రాలు గమ్మత్తును తిలకిస్తే… నీ చూపుల హర్షాలు మేనును పులకరిస్తాయి… కవ్వించలేని కాంతవి కావా? కవ్వించలేని కావ్యం కావా? రమణీయమైన రవిక...