Monday, 8 December 2025

నువ్వు నేను సమానం

నువ్వు నేను సమానం అని ఎప్పుడూ చెప్పను సమానమైన అగ్నిని మీరు అర్పలేదు 
నాది నీది అనే వాదన తీసుకురాను 
నాకున్న ప్రతిదీ నీదే నువ్వు తప్ప 
చెప్పి చెయ్యాలి అంటే ఫ్రీడం తీసుకున్నారు అంటున్నారు దాని వెనుకున్న నిశ్శబ్ద ఘర్షణ అర్థం అయ్యేది ఎప్పుడో.. కొంచెం బొద్దుగా ఉన్నావు అంటే బాడీ షేమింగ్ అంటున్నారు 
నువ్వు చిక్కిపోతున్నావు అన్నప్పటి బాధ కనబడదా? పద్ధతిగా డ్రెస్ వేసుకోమంటే కోపాలు... 
నచ్చినట్టు ఉండమన్నాను కానీ అందరి కళ్ళు మీ మీద ఉండేలానా? 
ఇండిపెండెంట్ అంటే అర్థం నువ్వు నేను వేరనా?
లేక నేనే పాత కాలంలో ఆగిపోయానా?
కేవలం సెక్స్ కోసమే అయితే జంతువుకు నీకు తేడా లేదు.
పెళ్లి అంటే భయంకరమైన స్టేజ్  చేసేసారు..
కాంప్రమైజ్ అనేది ఒక బూతు పదం చేసేసారు.. 
సమానం సమానం అంటూ సమాజం ఎటు పోతుందో మరి..

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...