సూర్యుని చుట్టు భూమి తిరిగినట్టు అమ్మాయిలు ఎందుకలా మీ చుట్టు తిప్పుకుంటారు..?
భూమి తిరిగితే రాత్రి పగలు తెలుస్తాయి.మాకు రాత్రేదో పగలేదో తెలియకుండా పోతుందే..
మా కక్ష్య తప్ప అన్ని కక్ష్యల్లో మీ కోసం వెతుకులాటేనా..?
మా చుట్టూ కాదు,ప్రపంచాన్ని చుట్టిరమ్మని ప్రోత్సహించండి..అనంత విశ్వాన్ని మీ అరచేతుల్లో పెట్టమా..?
కొంచెం వెలుగు పంచండి,పగలంతా వెన్నెల మయం చేయమా..?
మంచి దారికి ధైర్యమిస్తే పదిమందికి దారి చూపమా..?
ఆముదము మీరే..ఆయుధము మీరే..
అండగా ఉంటే అన్నీ మీరే..అడ్డుగా ఉంటే అడుగు ముందుకు పడదే..
ఆశయాన్ని నిలబెడతారా..? ఆశగానే వదిలేస్తారా..?