గురుపూజోత్సవం - 2019
అతను దైవం కాకపోవచ్చు, కానీ....
దైవాన్ని చూపగలడు.
అతను ఒక మంచి మార్గం కాకపోవచ్చు, కానీ....
ఒక మంచి మార్గాన నిన్ను నడుపగలడు.
అతను ఒక భగీరథుడు కాకపోవచ్చు, కానీ.....
ఆ భగీరథ ప్రయత్నం ను నీకివ్వగలడు.
అతను ఒక బ్రహ్మ కాకపోవచ్చు, కానీ.....
సృష్టికి ప్రతి సృష్టి చేయగల తెలివిని నీకివ్వగలడు.
అతను ఒక విష్ణువు కాకపోవచ్చు, కానీ.....
వంద రూపాలు ఎత్తైనా సరే..కార్యాన్ని పూర్తి చెయ్ అనే ప్రేరణనివ్వగలడు.
అతను ఒక మహేశ్వరుడు కాకపోవచ్చు, కానీ...
నీ మూడో కంటిలో వున్న అరిషడ్వర్గాలను మూసేవుంచమని చెప్పగలడు.
పుస్తక పాఠాలను పూర్తిగా అందించలేకపోవచ్చు, కానీ...
పుస్తక పాఠాలకు మించిన జీవిత పాఠాలను,
జీవితాంతం గుర్తుండేలా చేయగలడు.
అతను నింగి కాకపోవచ్చు, కానీ....
నింగి అనే ఈ ప్రపంచాన్ని వంచే,ఇంద్రధనస్సు నీకివ్వగలడు.
అతను ఏదీ కాకపోవచ్చు, కానీ....
ప్రతీదీ "నీకు దాసోహం" అని నిరూపించేలా చేయగలడు.
అతను ఎవరోకాదు...................
అత్యంత ఎత్తుకు నీవెదిగినా,అతను నా శిష్యుడు అని
ఆనందంతో మనసులోనే మురిసిపోయేవాడు.
తాను చేరుకోలేని స్థాయికి నీ వెళ్ళినా ,తనని ఆ స్థాయికి చేర్చింది నేనే అని
చెప్పుకోకుండా తెర వెనుక దాగి ఉండిపోయేవాడు.
అతనే ........
నిజమైన దైవం - నిత్యం మనతో ఉండే గురువు.
గురువు లేకుండానే పుస్తకసారం ద్వారా గొప్పవారం అవ్వొచ్చు కదా!
అని మీరు అడగవచ్చు?
పుస్తకపు సారం సరిపోవునా జగత్తునందు,మస్తక సారం లేకుండా?
గురువు లేకుండా ఏకలవ్యుడు ధనుర్విధ్యనందు గొప్పవాడు కాలేదా?
అని మీరు ప్రశ్నించవచ్చు?
అయ్యాడా! వీరుడు గురువు ముఖచిత్రం ఉంచకుండా? గురువుని మదిని తలచకుండా?
అంతెందుకు....
గురువాజ్ఞ ఇవ్వగానే రాముడు,తాటక తాట తీశాడు.
గురువాజ్ఞ వెలువడగానే అర్జునుడు,యుద్ధం చేసి గెలుపొంది వచ్చాడు.
కాబట్టి
గురుః దేవో గురుః విష్ణుః గురుః దేవో మహేశ్వరః
గురుః సాక్షత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః
చివరిగా చెప్పేదేమిటంటే...
శిష్యుడు తన గురువు ముందు ఎప్పుడూ ఓడిపోవాలనుకుంటాడు.
కానీ గురువు తన శిష్యుడెప్పుడూ ఓడిపోకూడదనుకుంటాడు.
ఇది ఎప్పటికీ వీడిపోని రసాయన బంధం.
మన గురువులకూ, మనకూ ఉన్న అనుబంధం.
రచన : బి.దుర్గబాబు.
E2, CSE (N160127)
IIIT - NUZVID

Awesome ra
ReplyDelete