Thursday, 19 September 2019

intena intena premante



తన అందం నిండు చంద్రబింబం.
తన కురులు స్వచ్ఛంగా ప్రవహించే జలపాతాలు.
తన కళ్ళు నన్ను ఆకర్షించే అయష్కాంత వలయాలు.
తన ముక్కు చిలక ముక్కు.
తన పెదవులు నా మనసుని తాకిన ఎర్ర గులాబి మొగ్గలు.
తన చెక్కిళ్ళు కొరుక్కుతినాలనిపించే చెక్కిలాలు.
తన చేతులు నా చేయిపట్టి నడిపించే సుతిమెత్తని పత్రాలు.
తన పాదాలు పూల పానుపు తొక్కినా కందిపోయే పాదాలు.
అబ్బో..తన సొగసు గగనాన ఏర్పడిన ఇంద్రధనసు.
ఇదేనా ప్రేమంటే...?
నిన్ను కనడంతో అందం పోగొట్టుకున్న అమ్మ అందం నల్లని చంద్రబింబమా?
నువ్వు కురులు పట్టుకు పీకినా కాస్తంతైనా కోపపడని తల్లి కురులు స్వచ్ఛమైనవి కావా?
కళ్ళనిండా నిన్ను నింపుకొని,అరక్షణం కనబడక పోతే అల్లాడిపోయే కళ్ళు గొప్పవికావా?
చీమిడి ముక్కు శుభ్రపరచి,ముక్కుతో మురిపించిన నాసికం గ్రద్ద నాసికమా?
'నా బంగారుకొండ' అని ఒళ్ళంతా తాకిన అమ్మ పెదవులు నీ మనసుని తాకలేకపోయాయా?
నీ చెక్కిట కన్నీరు జారితే,తన చెక్కిట బాధ అనుభవించిన చెక్కిళ్ళు గొప్పవి కావా?
జోజో అంటు జోలపాడి,ఊయలూపిన కరములు కరములు కావా?
రాళ్ళ పానుపుతొక్కినా నీ పాదాలు కందిపోకూడదని,
                               తన పాదాలపై నీ పాదాలుంచిన నాన్న పాదాలను చూడలేకపోయావా?
సొగసు ఏం కర్మ,సర్వస్వం నీ కోసం వదిలేసిన తల్లిదండ్రుల ప్రేమ గగనమే కదా!
ప్రేమించొద్దని నేను చెప్పడం లేదు,
                               పైపై మెరుగుల ప్రేమను రుచిచూచి కన్నవారి కలలను
                                                                                     కాటికి పంపించొద్దని అంటున్నా!
ఇటువంటి మాటలు మీ తలకెక్కవని నాకు తెలుసు.
కానీ మనసుతో ఆలోచిస్తే ఏది నిజమో మీకు మాత్రమే తెలుసు.






No comments:

Post a Comment

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...