తెలుగు భాషా దినోత్సవం
ఏదెక్కడ తెలుగు తోట - ఉన్నదంతా గంజాయి తోట
పట్టుపంచెలుపోయి - పట్టేసే జీన్సులొచ్చాయి.
లంగవోనీలు పోయి - లేనిపోని దుస్తులొచ్చాయి.
బుట్ట చెవిలీలు పోయి - చెవులుసాగే చెవిలీలు వచ్చాయి.
సడులు చేసే గాజులు పోయి - బోడిచేతులయ్యాయి.
బంగారుబొమ్మ అనే పదంపోయి- మోడ్రన్ అమ్మ అనే బిరుదులొచ్చాయి.
పప్పు,ఆవకాయ పోయి - పీజా,బర్గర్లొచ్చాయి.
సంకురాత్రి పండగలు పోయి - పబ్ రాత్రి పండగలొచ్చాయి.
పాయస,పరమాన్నములు పోయి - పనికి మాలిన పైడ్రైస్ లొచ్చాయి.
ఎంకిపాటలు పోయి - పెంకి పాటలొచ్చాయి.
జనము మెచ్చెడి జానపద గీతాలు పోయి డిజె కొట్టు డిజె అంటు డిజె లొచ్చాయి.
బూరె,గారెలు పోయి - బేకరీ కేకులొచ్చాయి.
అప్పడ అరిసెలు పోయి - అమ్మకపు సమోసాలొచ్చాయి.
బుర్ర కథలుపోయి - వెర్రికథలు మొదలయ్యాయి.
ఉగాది పచ్చళ్ళుపోయి - దాన్ని వండలేని తిప్పలొచ్చాయి.
అమ్మ నాన్న అనే హృదయ మాటలు పోయి - మమ్మీ డాడీ అనే నోటిమాటలొచ్చాయి.
పదహారణాల తెలుగమ్మాయి అనే మాట పోయి -
పదహారణాల తెలుగమ్మాయి అనే మాట పోయి -
ఎటువంటి అమ్మాయొస్తుందనే ఆలోచనలొచ్చాయి.
తీయనైన తెలుగు మాటలుపోయి - అర్ధంకాని ఆంగ్లమాటలొచ్చాయి.
ఏదెక్కడ తెలుగుదనం - ఇంకెక్కడ ఆ నిండుదనం?
నాటి నూతనానికున్న విలువ - నేటి నూతనానికేది?
ఆ నూతనాన్ని అనుభవించని నీకు నూతనమేది?
నూతనం వద్దని నేననడం లేదు కానీ..
తెలుగుదనం కన్నా గొప్ప నూతనం లేదని అంటున్నా.
ఇట్లు
మీ మిత్రుడు
బి.దుర్గ బాబు.(IIIT Nuzvid)
7995721404


