Wednesday, 28 August 2019

kavitha with music notes

                                 సంగీత పదాలతో కవిత

ఒక తల్లి తన కొడుకు ఇలా ఉండాలని కోరుకుంటుంది

సరిగ సరిగ  అని అందరు సమమని నువ్వు నడవాలని
రిగమ రిగమ అని రివ్వున ఎగురుతు రెక్కవిప్పాలని
గమప గమప మని గజము నీవని ఘీంకరించాలని
మపద మపద అని మంచి పథమున నీవు నడవాలని
పదని పదని అని పగను వదులుకొని ప్రేమ పంచాలని
దనిస దనిస అని దమ్ము ధర్యమని నీవు నమ్మాలని
నిసని నిసని అని నిసిని కొట్టుకొని శశిల రావాలని
సనిస సనిస అని సాధ్యమేమి లేదని నీవు నమ్మాలని
సనిద సనిద మని సద సంకల్పముతో
నిదప నిదప మని నిరాశ చెందని నిగ్రహముతో
దపమ దపమ అని ధర్మము వీడని దారులతో
పమగ పమగ మని పంతమువీడని పరాక్రమముతో
మగరి మగరి అని మనిషి మనీషి అని చాటిచెప్పగల మర్మముతో
గరిస గరిస మని గమ్యమెక్కడని వెతుకులాటతో
రిసరి రిసరి అని రొమ్ము విరుచుకొని రగడతో
తకదిమి తకఝను అని తాళమేసిన గెలుపు తలుపు తెరిచి
తదిగినత అని తానెదిగిన తళుకు మెరుపై మెరిసి
తఝనుత మని ,ఆ ఘనత గని సుచరితను సృష్టించి
కిటకిటమని,తదికిటమని,తళ తళ మని తళాంకుతోమని
కళ కళ మని , భళ భళ మని జయభేరి మ్రోగించి
ప్రతి ఒక్క ఒక్కరికీ ప్రేరణగా నిలవాలని కోరుకుంటుంది.
అలాగే........
నీ గొంతు ప్రతి గొంతుకు కదలికివ్వాలని
సరిగమపదనిస అని ఎదుగుతూ
సానిదపమగరిస అని ఒదుగుతూ
వుండాలని సంగీత తల్లి కోరుకుంటుంది.
 
                                                                                               రచన : బి.దుర్గబాబు 
                                                                                                IIIT NUZVID
                                                                                               7995721404

 
   

No comments:

Post a Comment

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...