Saturday, 24 May 2025

కాలం

కాలం చాలా దూరం వెళ్లిపోయింది మిత్రమా...

బాల్యంలోని భయాల నుండి బాధ్యతలు తెలుసుకునేంతవరకు,
సరదాగా సమయం గడిపేంత నుండి సమయం లేనంతవరకు,
ప్రతీదీ అద్భుతం అనుకునేంత నుండి అద్భుతాలు సృష్టించేవరకు,
కలలో రాకుమారి నుండి ఇలలో రాకుమారి అనేవరకు,

కష్టం ఓ కథ అయ్యింది,
ఇష్టం ఎక్కడో ఉంది,
అవసరాల కోసం పరుగులు పెడుతూ,
అవసరమైనది వదిలేస్తూ,
గాయాల గాటును తట్టుకుంటూ,
మోసాలను మౌనంగా భరిస్తూ,
చింతలేదు చిగురులేదు,
రాబోయే వాటికోసం దిగులు లేదు...

చిరునవ్వుతో ఎదుర్కోవడం తప్ప చేసేదీ లేదు
ఏదో కోల్పోయాం అని బాధపడుతూ ఉంటే అర్ధమూ లేదు

ఇంకెంత దూరం మిత్రమా... రెండు అడుగులే...
కష్టానికి నువ్వు కేర్ ఆఫ్ అడ్రస్ కాదు...
నీకు నువ్వు నిలబడు చాలు.








No comments:

Post a Comment

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...