Sunday, 15 June 2025

నాన్న..

కన్నీళ్ళు కథలు రాస్తే వీధి మొత్తం గుంతలేకదా!
వెక్కిళ్ళ ఏడుపు వ్యాసమే కదా!
భారంతో నిండిన గుండెకు బాధ ఓ లెక్కా?
భాధ్యతతో నిండిన మనసు బరువు మోయడం లెక్కా?
నీతోడు ఉంటే బాగున్ను ఏమో..
కనుల దగ్గర మొదలైన నీటిబిందువు మనసు దాహం తీరుస్తుందా?
చెక్కిళ్ళను తడిచేసిన నీటిబిందువు జ్ఞాపకాలను చెరిపేస్తుందా?
చితిలో నువు కాలితె చెరసాల నాకేల నాన్న..
చిత్రంగా చిత్రమై కనులనుండి పోవెందుకు?

No comments:

Post a Comment

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...