అగ్నితో ఆనందాన్ని పంచుకోనా?
బూడిదను విభూదిలా పెట్టుకోనా?
కట్టెలను కనికగా భావించనా?
పాడేను పల్లకిలా భావించనా?
కాల్చి ఎముకల నిచ్చినందుకు,
దహించి దేహాన్ని తీసుకెళ్లినందుకు,
నాకు విలువలు పంచినవారిని విడదీసినందుకు,
నేనెక్కిన భుజాల పల్లకి లాగుకున్నందుకు...
నిన్ను తనలో కలుపుకున్న నేల కౌగిలితో,
కడతెలియని నా కన్నీటి సముద్రంతో,
సందేశం పంపుతున్నా...
**“Happy Father’s Day” అని...
తననుండైనా వింటున్నావా...?**
Sunday, 28 September 2025
అగ్నితో ఆనందాన్ని పంచుకోనా
Subscribe to:
Post Comments (Atom)
ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది
ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది ఏదో చెప్పలేని భావన ఉంది నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...
-
కాలం చాలా దూరం వెళ్లిపోయింది మిత్రమా... బాల్యంలోని భయాల నుండి బాధ్యతలు తెలుసుకునేంతవరకు, సరదాగా సమయం గడిపేంత నుండి సమయం లేనంతవరకు, ప్రతీదీ అ...
-
నీ మాటల మంత్రాలు గమ్మత్తును తిలకిస్తే… నీ చూపుల హర్షాలు మేనును పులకరిస్తాయి… కవ్వించలేని కాంతవి కావా? కవ్వించలేని కావ్యం కావా? రమణీయమైన రవిక...
No comments:
Post a Comment