Sunday, 28 September 2025

హర్షిత చెలిమి

తన అల్లరి ఆకాశమైతే,  
ఆటపట్టిస్తే వచ్చే అలక పాతాళం 

చిమ్చాంగ్‌గా చేసే చిందులు చెప్పలేనన్ని అయితే,  
సరదాగా గడిపే క్షణాలు సముద్రమంత.  

అందరినీ అలుకుపోయే ఆమని,  
మనసు నిండా మనం అనే భామిని.  

మనిషిని తాకే అందం తాను కాకపోవచ్చు,  
మనసును తాకే మందారం తాను.  

పుడమికి వర్షం ఇచ్చే హర్షం...  హర్షిత..

No comments:

Post a Comment

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...