Thursday, 13 February 2020

salaam sainika - gurtumchukumtam oopiri poyedaaka


                         సలాం సైనికా..
                                          గుర్తుంచుకుంటాం మా ఊపిరిపోయేదాకా..

ఎండలో మానై ఎండిపోతున్నారు మనకు నీడనిస్తూ...
ఎండిన పిదప మోడై కాలిపోతున్నారు మన చలిని కాస్తూ...
హరివిల్లై గొడుగు పడుతున్నారు మన తడుపును కాస్తూ..
వడగల్లై చల్లని సౌఖ్యమిస్తున్నారు తమ సుఖమొదిలేస్తూ..
భారతావనిని మోస్తున్నారు తమ భుజాలు కాస్తూ..
నేత్రాలకు నిద్రిస్తున్నారు సరిహద్దుల వెంబడి కాపల కాస్తూ..
ఊపిరొదిలేస్తున్నారు మనకు ఊపిరిపోస్తూ..
శవాలల్లే మారుతున్నారు వారి దేహమడ్డేస్తూ..
అతనెవరో నీకు తెలుసా?....
నీరసమే నీరస పరచినా, దేశభక్తే ఒంటినిండా..
ఆహారమే లేకున్నా, "జై భారత్" నోటినిండా..
కనురెప్పలు మూతబడుతున్నా కారం కొడుతూ కునుకేయకుండా..
మండే గుండు గుండెను చీల్చిన, గుండెల నిండా దేశపు జెండా..
దేహం మొత్తం నేలకొరిగినా అనుకున్నావన్నా
                                            "నాకేమవుతుంది భరతమాత ఒడినేనుండా"..
వరికంకులు మనకిచ్చి దుబ్బులుగా మారిన 40 మంది సైనికుల మరణం
కొరివి మడులైపోయెను వారి కుటుంబాల జీవితం
ఇలా కన్నీటి కవితగా మలిచింది నాకలం- పుల్వామా దాడి నాలో రేపిన కలకలం 
ప్రాణం పెట్టిన వారికోసం పది నిముషాలైనా మౌనం పాటిస్తావని ఆశిస్తూ..
జై జవాన్..........జై కిసాన్..............
                                 
             రచన : బి.దుర్గబాబు
             IIIT Nuzvid.
             7995721404

marchipo lekunna - మర్చిపో లేకున్నా



అద్దంలో నువు చూస్తే అది నేనే అనుకున్నా..
         కానీ అద్దానికి మరోవైపు ఉంచుతావని తెలుసుకోలేకున్నా..
చిలుకగా ఈ గోరింకతో చివరిదాకా ఉంటావనుకున్నా..
        తుమ్మముల్లు తలనుదించి పిచ్చివాడ్ని చేసి ఎగిరిపోతావని తెలుసుకోలేకున్నా.. 
నీ మనసు ఎంతో విశాలమైంది అనుకున్నా..
        నాకు కూడా చోటులేనంత విశాలమైందని అర్ధంచేసుకోలేకున్నా..
చీకటిలో చందమామ నువ్వేనని మురిసిపోయా..

       నిజంగా నన్ను చీకటి చేసి దూరం చేస్తావని కలగనలేకపోయా..
నా కంటిలోకాంతివై దారి చూపుతావనుకున్నా..
       కానీ కంటిలో నలుసై నరకం చూపిస్తావని ఊహించలేకున్నా..
నా కనులనుండి నీరు వస్తే ఆనందభాష్పాలని నా కనులనుకుంటున్నాయి

     నా మనసుకు మాత్రమే తెలుసు నా బాధను బయటకు తెచ్చే అలలవంటి కన్నీరని .
గుండె ముక్కలై నిన్ను చూస్తే కోపమొస్తుంది

     కోపం చూపడానికి కూడా"నువ్వు నాదానివి కావు" అనే ఊహ కలిచివేస్తుంది

పోతే పో -
            నా నుండి దూరంగా, నా నీడకు దూరంగా

పోతే పో -
           నా కళ్ళకు కనిపించనంత దూరంగా,నీ మాట వినబడనంతదూరంగా
పోతే పో -
           నా ఊహకందనంత దూరంగా,నీ ధ్యాస మరిచేంత దూరంగా
పోతే పో -

          నీ శ్వాస తగలనంత దూరంగా, నా తుది శ్వాస తెలియనంత దూరంగా
ఇన్నిసార్లు   పోతే పో    పోతే పో అన్నాను కానీ

                 నీనుండి ఎలా పోవాలో నాకు అర్ధంకావడం లేదు.
హార్ట్ లోని ఫీలింగ్ కదా! హార్ట్ ఎటాక్లా వెంబడిస్తుంది

మనసుండబట్టలేక కవితరూపంలో ఇలా కన్నీటిని వెలబోస్తుంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...