మురిసిపోయినప్పుడు బానే ఉంటుంది,
కానీ ముసలోడయ్యాకే మోజు తీరిపోతుంది...
వీపుపై ఎక్కించుకున్నప్పుడు బానే ఉంటుంది,
వీపువంగినపుడు వృద్ధాశ్రమాల బాటపడుతుంది...
బాధ్యత మోసినందుకేమో భారమైపోయాడు...
అన్నీఇచ్చినందుకేమో అనాథగా మిగిలిపోతున్నాడు..
అడిగిచూడు నాన్నలేనివారి జీవితాన్ని...
తనకోసం కార్చే కన్నీటి జలపాతాన్ని...
దూరమయ్యాక "నాన్న" అనే కన్నా,
దగ్గరున్నప్పుడు "నా" అనుకుంటే సరిపోతుందిగా..