Saturday, 22 July 2023

సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ను నేను.

 కెరీర్ను కంపెనీకి అమ్మేసి,

మెదడును మేనేజర్కి అమ్మేసి,

టాలెంట్ను టి.ఎల్కి అమ్మేసి,

ప్రయాణమంతా ప్రాజెక్ట్కి అంకితంచేసి,

సమయమంతా శూన్యంలో కలిపేసి,

ప్రెజర్ అనే కుక్కర్లో ఉడుకుతూ,

'నీకేంట్రా జాబ్' అనిపించుకొని,

తొమ్మిది టు తొమ్మిది తోమించుకొని,

వీకెండ్లో వొర్క్ చేసి,

డేఎండ్లో దిమాక్ డీఫ్రిజ్లో పెట్టి,

స్ప్రింట్ ఎండ్లో పైనుంచి ప్రెజరు,

వొర్క్ అవ్వక నైట్ అంత ప్రెజరు,

పైకేమో పాష్ లుక్,

పార్మల్స్ తో వేయాలి బెల్ట్ టక్,

మీటింగ్లో మనసు ఆబ్సెంట్,

రోజూ డబ్బాముందు బోడీ ప్రెజెంట్,

రన్వేలో రెంట్ కమింగ్,

ఎగురుకుంటూ ఇఎమై కమింగ్,

గాల్లో గ్యాస్ బిల్ కమింగ్,

వయా వాటర్ బిల్ కమింగ్,

పిలవకుండానే ప్రాబ్లంస్ కమింగ్,

వీటన్నిటి మధ్యలో...

కిందపడి,పైన పిడి,

హైక్ లేక,లైక్ లేక,

జీవితాన్ని జీతానికి తాకట్టుపెట్టిన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ను నేను. 

                                                -దున్శేవర్


శ్యాం సుందర సాయి

 కోపం కొండంత,

ప్రశాంతత ప్రసాదమంత,

ఆశలేదు చెలిచెంత,

నవ్వు చిగురుచింత,


శ్యాం వేణుగానం సుందరం,

రామాయణ సుందరకాండ సుందరం,

సాయినాథుని మనసు సుందరం,

మరి శ్యాం సుందర సాయి కాడా సుందరం?

Thursday, 13 July 2023

Forgive

ఎదుటివారిది తప్పే అయి ఉండవచ్చు,

వారిపై కోపం ఉండవచ్చు,

మనవారు మనకోసం ఒక మెట్టుదిగితే,

కోపాన్ని విడిచి పలకరాదా? మిత్రమా..

కోపం శాశ్వతమా? గతం ప్రస్తుతమా?

మౌనాన్ని వీడి మాటలాడలేవా?

చల్లని చంద్రునిలో మచ్చలెదుకుట న్యాయమా?

ఐశ్వర్యం ఉన్నప్పుడు అందరూ ఉంటారు.ఏమీలేనప్పుడు?

గుర్తుపెట్టుకో వాళ్ళు ఎప్పుడూ నీవాళ్ళు

నీతోనే ఉంటారు,నీకోసం ఉంటారు,

బాదలోనైనా..బాధ్యతలోనైనా..

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...