Saturday, 22 July 2023

సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ను నేను.

 కెరీర్ను కంపెనీకి అమ్మేసి,

మెదడును మేనేజర్కి అమ్మేసి,

టాలెంట్ను టి.ఎల్కి అమ్మేసి,

ప్రయాణమంతా ప్రాజెక్ట్కి అంకితంచేసి,

సమయమంతా శూన్యంలో కలిపేసి,

ప్రెజర్ అనే కుక్కర్లో ఉడుకుతూ,

'నీకేంట్రా జాబ్' అనిపించుకొని,

తొమ్మిది టు తొమ్మిది తోమించుకొని,

వీకెండ్లో వొర్క్ చేసి,

డేఎండ్లో దిమాక్ డీఫ్రిజ్లో పెట్టి,

స్ప్రింట్ ఎండ్లో పైనుంచి ప్రెజరు,

వొర్క్ అవ్వక నైట్ అంత ప్రెజరు,

పైకేమో పాష్ లుక్,

పార్మల్స్ తో వేయాలి బెల్ట్ టక్,

మీటింగ్లో మనసు ఆబ్సెంట్,

రోజూ డబ్బాముందు బోడీ ప్రెజెంట్,

రన్వేలో రెంట్ కమింగ్,

ఎగురుకుంటూ ఇఎమై కమింగ్,

గాల్లో గ్యాస్ బిల్ కమింగ్,

వయా వాటర్ బిల్ కమింగ్,

పిలవకుండానే ప్రాబ్లంస్ కమింగ్,

వీటన్నిటి మధ్యలో...

కిందపడి,పైన పిడి,

హైక్ లేక,లైక్ లేక,

జీవితాన్ని జీతానికి తాకట్టుపెట్టిన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ను నేను. 

                                                -దున్శేవర్


No comments:

Post a Comment

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...