Thursday, 3 August 2023

నగుమోము శశి

నల్లని మబ్బులవెనుక దాగిన నగుమోము శశి,

కల కలిగిన కళ్ళకు రాశావా నిసి,

నీ నవ్వుకు పరిహారం ముత్యాలహారమైతే,

కనుబొమ్మల కంచెకు సదా దాసోహం.

చెరసాల కడుతుంటే చెక్కిలాలు,

చెలిఖైదు చేస్తున్నవే చెర్రీ పెదాలు.

మెడనున్న హంస మనసున విహరిస్తు ఉంటె,

చెవికమ్మెలు గుండెలో గంట కొడుతుంటే,

గారాబంగా గాజులు గాయపరుస్తుంటే,

గజినీగ నను చేసిన నీ రూపు గమ్మత్తు.

కనుతిరగనంటుంది కాసేపు పక్కకు,

నీ మాయకు మెడిసన్ ఏది మగువా...!

                                          -దున్శేవర్

No comments:

Post a Comment

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...