అర్ధంకాని ప్రేమ..
ప్రేమ
కాకిలాంటిది.
వదిలేస్తే అరుస్తుంది,పట్టుకుంటే
పొడుస్తుంది.
ప్రేమ
దురదగొండి ఆకులాంటిది.
అంటుకుంటే మండిపోతుంది,అష్టకష్టాలు నిన్ను పెడుతుంది.
ప్రేమ
సూర్యుని ఎండలాంటిది.
సర్రుమంటూ కాలుతుంటుంది,చెమటతోనే తడుపుతుంటుంది.
ప్రేమ తేనెటీగలాంటిది.
జుమ్మంటూ ఈలవేస్తుంది,దాన్ని గెలికితే నిన్ను కుడుతుంది.
ప్రేమ మిణుగురు పురుగులాంటిది.
చూడటానికి అందంగా ఉంటుంది,వచ్చివాలితే నొప్పి కలుగుతుంది.
పై వాటిని అర్ధవంతంగా ఆలోచించి చూస్తే....
అదే ప్రేమ.....
ఎంత అరిచినా నీపై మాత్రమేనంటుంది,
ఎంత పొడిచినా ఆ గాయాన్ని నేనే మానుపుతానంటుంది.
ఎంత మండినా నిన్ను వదలదు,విముక్తిని ఇచ్చేవెళ్తుంది.
ఎంత కాలినా సాయంకాలపు ఎండై చల్లబడుతుంది,
చెమట చిందిన నీకు చల్లగాలై కొడుతుంది.
ఎంత కుట్టినా,తేనె ధారలతో నీ మనసు నింపేస్తుంది,
ఈల వేస్తూ తాగమంటుంది.
ఎంత, నొప్పి అనే కష్టాన్ని తట్టుకుంటే అంత వెలుగును చూడగలవంటుంది.
చివరిగా.....
ఎలా వర్ణించాలో తెలియని తీయని భావన ప్రేమ
గుండెలోతులో ఉందని అంటే,దాన్ని కోసి చూసినా కనబడని ప్రేమ.
ప్రేగు బంధంతో మొదలయ్యేది ఒక ప్రేమ అయితే
ప్రాణంపోయేదాకా నువ్వే సర్వస్వం అనుకునేది ఇంకో ప్రేమ.
రచన
బి.దుర్గబాబు
IIIT NUZVID
7995721404