పాటలు తప్ప మాటలురావని అంటారు..
మాట్లాడితే మాధుర్యం ఎక్కువైంది ఆపే అంటారు..
కుదిరితే నిప్పుగా అత్యంత కాంతినిస్తా..
లేదంటే నీరై నిర్మలంగా మారిపోతా..
రెండింటి స్వభావాన్ని ప్రతిబింబించలేనుగా?
నా చుట్టు ఉంటు పెట్రోల్ పోసి బాధ చెలరేగేలా చెయ్యొద్దు.
నవ్వు నటించి నా నవ్వును ఆవిరి చెయ్యొద్దు.
ఇదంతా ఎందుకు కష్టం అనుకుంటే చెలిమే.. చెయ్యొద్దు.
ఇదే నేను, తటస్థం వీలుపడదు,
తగువా...? తనువా...?
-Dunsever