Sunday, 28 November 2021

Don't defeat your family

గెలుపు కావాలంటే ఓటమిని ఒదిలేయ్...

కష్టపడాలంటే బద్దకాన్ని ఒదిలేయ్...

ధైర్యం కావాలంటే భయాన్ని వదిలేయ్...

టాలెంట్ చూపించాలంటే సిగ్గు వదిలేయ్...


కొన్నిసార్లు లైఫ్ కావాలంటే లవ్ వదిలేయ్

ఎందుకంటే...

నువ్వు పొందాల్సిన దానికోసం,

నీతో ఉన్నవారిని ఓడిపోయేలా చేయకు.

సరే ఆలోచించు...

కనిపించెనా? గెలిచిన ప్రేమ చరిత్ర పేజీల వెనుక...

ఆర్పగలవా? నీ ఆశయాలకు నిప్పంటించాక..


Monday, 22 November 2021

Don't commit sucide

పిరికోళ్ళకి స్థానం లేదీ ప్రపంచంలో...

పోరాటపటిమలేని పౌరులు అవసరంలేదీ జగతిలో..

సమస్యని సమస్యగా వదిలేసే సన్నాసులు అనవసరం.

పచ్చటి మెతుకుల పౌరుషానికే అవమానం.

నీవల్ల...కేవలం నీవల్ల...

తల్లిదండ్రులకు కడుపుకోత..బంధువుల నుండి జాలిపూత..

తీర్చగలరా ఎవరైన ఆకలిరోత?..నిలదొక్కుకోలేక నువ్వెక్కితె పాడిమోత..

కనుమూస్తే  దొరుకుతుందనుకుంటున్నావా స్వర్గం?

నీవారందరిని నరకానికి తోసేశావుగా ఓ నేస్తం.. 


Saturday, 13 November 2021

I can't get you

 తానో నింగి నేనో నేల - అందేదెలా?

తానో శిల్పం నేనో రాయి - చేరేదెలా?

తానో మెరుపు నేనో నలుపు - కంటపడేదెలా?

తానో బంగారం నేనో బొంగరం - కొనేదెలా?

తానో యువరాణి నేనో బక్కప్రాణి - కలిసేదెలా?


తానో వరం - పొందలేకపోవడమే నా శాపం

ఎవరిపై చూపను నా కోపం- తపించడమే మట్టిలో కలిసేంతవరకూ ఈ దేహం

                                         -దుర్గబాబు

Thursday, 4 November 2021

సమయం విలువ

 కేజీ కండలేదు..కొండంత అండలేదు.

మెడలో వేసేంత దండలేదు..దండ వేయించుకునే స్థాయి లేదు.

సరసాలకు చెలి లేదు..చెలి ఇచ్చే కౌగిలి లేదు.

అదిలేదు...ఇదిలేదు...అనడానికి నీకు బుర్ర లేదు.

వాడుకుంటే సమయమంత విలువైనది లేదు.

పై వాటిలో దేనికీ కొదువలేదు.

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...