పిరికోళ్ళకి స్థానం లేదీ ప్రపంచంలో...
పోరాటపటిమలేని పౌరులు అవసరంలేదీ జగతిలో..
సమస్యని సమస్యగా వదిలేసే సన్నాసులు అనవసరం.
పచ్చటి మెతుకుల పౌరుషానికే అవమానం.
నీవల్ల...కేవలం నీవల్ల...
తల్లిదండ్రులకు కడుపుకోత..బంధువుల నుండి జాలిపూత..
తీర్చగలరా ఎవరైన ఆకలిరోత?..నిలదొక్కుకోలేక నువ్వెక్కితె పాడిమోత..
కనుమూస్తే దొరుకుతుందనుకుంటున్నావా స్వర్గం?
నీవారందరిని నరకానికి తోసేశావుగా ఓ నేస్తం..
No comments:
Post a Comment