ఎందుకు పరిగెడుతున్నానో తెలీదు,
దేన్ని అన్వేషిస్తున్నానో అర్ధం కాదు,
ఏదో కావాలి..
ఏదో సాధించాలి..
మనసుకు నచ్చింది చెయ్యాలని మనసులో ఉన్నా..
మనతో ఉన్నోళ్ళు ఇబ్బంది పడకూడదని మనసు చంపుతున్నా..
వాడికేంట్రా జాబ్ చేస్తున్నాడు అని అందరూ అన్నా..
జాబ్ తప్ప నేనేం చేస్తున్నాను? అనే ప్రశ్న నాలో ఉంది..
కలల్ని కాలంలో కలిపేసి,
కష్టపడాలి అనే ముసుగులో ఇష్టపడటాన్ని ఎప్పుడో మానేశా..
కాసేపు కబుర్లు చెప్పే మనుషులు లేక,
మనసువిప్పి మాట్లాడే సమయం లేక,
పరిగెత్తే వయసు కోసమో.. లేక,
పనికిరాకుండా పోతానేమో అనే భయం కోసమో,
నిత్యం నాతో నేను చేసే యుద్ధం.
జీవితంతో నేను ఆడే దాగుడుమూతలు.
Friday, 29 March 2024
ఎందుకు పరిగెడుతున్నానో తెలీదు
Subscribe to:
Post Comments (Atom)
Distance makes difference - సిరి
Distance makes difference అంటారు..... ఆకాశం అంటుంది అంటా... ఆ మబ్బులాగే నీ ప్రేమ వస్తూ ఉంటాది మళ్ళీ పోతుంటాది అని.... మేఘం అంటాది అంటా నువ్...
-
పరిగెత్తు ఏడ్చిన ప్రతిసారి పరిగెత్తు నిన్ను చూసి జాలిపడిన ప్రతిసారి పరిగెత్తు ఓడిపోతానన్న ప్రతిసారి పరిగెత్తు అలాగే పడిపోయిన ప్రతిసారి లే...
-
నా గుండె నడుగు నీ కోసం నా గుండె కొట్టుకోని క్షణం లేదు నా చెవులను అడుగు నీ పేరు వినగానే ఆనంద పడని రోజు లేదు నా కనులు అడుగు నువ్వు కనిపిస్తే...
-
Distance makes difference అంటారు..... ఆకాశం అంటుంది అంటా... ఆ మబ్బులాగే నీ ప్రేమ వస్తూ ఉంటాది మళ్ళీ పోతుంటాది అని.... మేఘం అంటాది అంటా నువ్...
No comments:
Post a Comment