Tuesday, 30 May 2023

సహనాన్ని గెలకొద్దు

 మాట అంటె పడటానికి,

తిడితే తీయగ తీసుకోవడానికి,

పరిహాసమాడితే పడివుండడానికి,

వాదనకు దిగితే వదిలేయడానికి,

చిరాకు తెప్పించిన సర్ధుకుపోవడానికి,

నేను నీకేమవుతానో ఆలోచించు..

బ్లడ్ రిలేషన్ ఆ..? లేక గుడ్ రిలేషన్ ఆ..?

మౌనంగుంటే మూగోడిని కాదు,

మనసు నొప్పించరాదని మౌనంగున్నా.

స్నేహమంటే కొవ్వొత్తిలా కరిగైనా వెలుగిస్తా..

గేలి చేస్తే మైనంపోసి తగలెడతా.

                                           - దున్సేవర్


No comments:

Post a Comment

Distance makes difference - సిరి

Distance makes difference అంటారు..... ఆకాశం అంటుంది అంటా... ఆ మబ్బులాగే నీ ప్రేమ వస్తూ ఉంటాది మళ్ళీ పోతుంటాది అని.... మేఘం అంటాది అంటా నువ్...