Sunday, 18 June 2023

సాడ్ఫాదర్స్ డే

 అగ్నితో ఆనందాన్ని పంచుకోనా,

కాల్చి ఎముకలనిచ్చినందుకు.

బూదిదని విభూదిలా పెట్టుకోనా,

దహించి దేహాన్ని మార్చ్గినందుకు.

కట్టెలను కానుకగా భావించనా,

నాకు విలువలను పంచినవారిని విడదీసినందుకు,

పాడెను పల్లకిలా భావించనా,

నేనెక్కిన భుజాల పల్లకి లాక్కున్నందుకు.


నిను తనలో కలుపుకున్న నేలకు కౌగిలితో,

కడ తెలియని నా కన్నీటి సముద్రంతో,

సందేశం పంపుతున్నా ..హాపీ ఫాదర్స్ డే అని..

తన నుండైనా వింటున్నావా?

No comments:

Post a Comment

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...