గుర్తించలేకపోయాను నాన్న నిన్ను....
నా జన్మకు కారణం నీవని,నీవు లేనిదే నేను లేనని
రాసే కలం ముల్లునేనని,అందులోని సిర నీవని
రాజ్యమేలే రాజుని నేనని,దాన్ని మోసిన పల్లకి నీవని
గుర్తించలేకపోయాను నాన్న నిన్ను....
వెలిగే జ్యోతిని నేనని,ఆ జ్యోతికి కారణమైన ఒత్తివి నీవని
నేను చాలా వేగమని,కానీ ఆ వేగానికి కారణమైన గుర్రం నీవని
ప్రతీదీ నాదని,కాదు ఆ ప్రతీదీ ఇచ్చింది నీవని
గుర్తించాను నాన్న నిన్ను....
ముందు వచ్చే ఎండ నిజం కాదని,వెనుక వచ్చే గాలి నీ ప్రేమని
సర్వస్వం నీవు నా జీవితానికి అంకితమిచ్చావని
నా గెలుపుకు కారణమై నీవు ఓటమిని రుచిచూసావని
కానీ ఇదంతా....
భగ భగ మండే అగ్నిలో నీవు ఆహుతైపోయాక
తలక్రిందులుగా తపస్సు చేసినా తిరిగిరాని నిన్ను కోల్పోయాక

No comments:
Post a Comment