స్పందించవా! ఓసారి
ఎడారిలో ఓ ఊట బావిలా కనిపించావుచేరుకుందామంటే భయం
చిరుగాలి చిరునవ్వుతో తరుముతుంటావు
చెంతకొద్దామంటే సిగ్గు బిడియం
మాటల తూటాలను పంపుతుంటావు
అవి తగలకపోతే గుండె ఆగుతుందనే భయం
నువ్వొదిలే శ్వాసను నావైపు పంపుతుంటావు
ఆ శ్వాస నాకందకపోతే ఊపిరాడదేమోనని భయం
ఇంత భయాన్ని బంధించి
నువు నా సొంతం కాకుండాపోతావనే భయంతో
భయంగా వచ్చి చెప్పా "ఐ లవ్ యు" అని,
ఆశగా ఎదురుచూశా "ఐ టూ" చెప్తావని,
కానీ నేను అనుకోలేదు నువ్వు మౌనం వహిస్తావని,
నీ జవాబుకై జేబుదొంగలా ఎదురుచూస్తున్నా
నిన్ను దోచుకుందామని,నాలో దాచుకుందామని,
నీ స్పందనకై కాలరాత్రిలో కూడా మెలకువగా ఉంటా..
కాకితో కబురంపినా కాస్తంత ఊపిరి పీల్చుకుంటా..
నీ సమాధానానికై సదా వేచి చూస్తూ
No comments:
Post a Comment