ప్రపంచమంతా జాలిచూపే రోజు నీకుంది.
స్వార్ధపూరిత ప్రపంచంలో నీపై జాలి కోసం ఆరాటపడకు.
వర్షం కోసం ఎదురుచూసి విత్తనం మొలకెత్తదు.
మబ్బుల నీడను దాటి మొక్క మానై నీడనిస్తుంది.
కన్నీటితో కాలు కదిపిన నువ్వు,
ఎదుటివారి కన్నీళ్ళు తుడవగలవు.
కాకి నలుపే,సహకారంలో దాని మనసు తెలుపు.
నీ గుండె ఆగినా..పదిమంది గుండెలో నీవు నిలిస్తే..
ప్రపంచమంతా జాలిచూపే రోజు నీకుంది.
ప్రపంచానికి జాలి చూపే రోజేముంది?
No comments:
Post a Comment