ఒకప్పుడు కలసి వెతికిన దారులు
కళ్ళు మూసినా తెరిచినా
ఓపిక లేనంతగా పరుగు తీసిన ఊసులు
చిన్న చిన్న కోపాలతో అలకలతో
నడిచిన ప్రతి అడుగులో నాతో ఉండే మీరు
ప్రతి చీకటిలో కనుల తడి,
వెలుతురు రాగానే ఇంకేలా చేసి నవ్వును తోడేస్తున్నా.
బహుశా స్నేహభారం మోయడం కష్టమేమో
కలిసిన కొన్నిక్షణాలు ఆనందం ఇస్తే,
వెలిపోతారనే బాధ ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది
మీ ప్రతి కన్నీటికి బదులు తీర్చుకుంటున్నావా మిత్రమా?
లేక నిజంగానే నేను ఒంటరిని అని గుర్తుచేస్తున్నావా? మిత్రమా
No comments:
Post a Comment