Wednesday, 19 November 2025

బంగారం ఆని పిలవని..

బంగారం ఆని పిలవని బంగారాన్ని,
మమ్మల్ని తాకట్టుపెట్టని మగువని,
కనురెప్పల అంచున కాటుకతో కోసినా,
అలా చిరు అదరాలతో మందురాసే ఆమనిని,
నడుమంపుల్లో నను కట్టేసినా,
చీరంచుల్లో నను చుట్టేసినా,
తనవెనకాల తిప్పుకున్నా, తనువంతా నింపుకున్నా
ఇది నీకు నాకు సెట్ అవ్వదు అనే ఇంతిని కాక,
తనలా తానున్నా..తనలో నను చూసే లలనని,
వెతికి గిఫ్ట్ పంపించు...కొంచెం శ్రమ తగ్గుతుంది మాకు

నోట్ : కుక్కర్లోనో డ్రంలోనో ఉడికించని వారిని వెతకాలని మనవి

No comments:

Post a Comment

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...