కలువల కారడవిలో
నెమలి ఈనెల ఊయలలో
రాతిరిలో చందమామను చూస్తూ
ఊడలనే ఒడిసిపట్టి
మృదువైన వంతెనపై జారుతూ
నునువెచ్చని గాలిలో
పట్టెమంచంపై పరవశించి నిద్రపోతూ
లోతైన చల్లటి లోయలో
గులాభి హంస సాయమందించి
స్ట్రాబెర్రీ మైదానంలో విడిచిపెడితే
జున్నులాంటి తీరమొచ్చింది బయటపడదామంటే
కాపలా ఉన్న నది దాటనిస్తేనా?
ప్రయత్నమేమోగానీ ప్రాణమొదిలి వెళ్ళలేనుగా.
-దున్శేవర్
ప్రతి లైనుకీ ఈ పదాలును అన్వయించండి.
1.కన్నులు
2.కనురెప్పలు
3.కనుగుడ్డు
4.కనుబొమ్మలు
5.ముక్కు
6.శ్వాస
7.పైపెదవి
8.నోరు
9.నాలుక
10.ఎర్రటి కిందిపెదవి
11.గడ్డం
12.మోము(ముఖం)
No comments:
Post a Comment