కూటి కోసం దేహాన్ని అమ్ముకునే వారిని చూసి చెప్పమంటావా - హాపీ ఉమెన్స్ డే అని
ఇంతి అంటే బంతి అని ఆడుకునే సమాజాన్ని చూసి చెప్పమంటావా - హాపీ ఉమెన్స్ డే అని
"సీతారాముడు" అనే పేరులో ఇచ్చిన గౌరవాన్ని ఇంటిలో ఇవ్వనివారిని చూసి
చెప్పమంటావా - హాపీ ఉమెన్స్ డే అని
స్వేచ్ఛగా తిరిగే కుందేలును వంటింటి కుందేలు చేసినందుకు
చెప్పమంటావా - హాపీ ఉమెన్స్ డే అని
ఆడపిల్ల అనగానే కడుపులో చంపేసే రాక్షస భావనను చూసి
చెప్పమంటావా - హాపీ ఉమెన్స్ డే అని
ఒక వస్తువులా విదేశాలకు అమ్ముకొని సొమ్ము చేసుకునే ముఠాలను చూసి
చెప్పమంటావా - హాపీ ఉమెన్స్ డే అని
అణువణువునా కిందికి లాగేవారిని చూశా...
అడుగడుగునా అడ్డంపడేవారిని చూశా...
కన్య కానుకలను చూశా...కట్నం వేదింపులను చూశా...
WOMEN కాదు WE MEN అనే భావన కల్గినపుడు చెప్పు , అప్పుడు చెప్తా.......
హాపీ ఉమెన్స్ డే అని
No comments:
Post a Comment