Friday, 24 August 2018

The Remedial Student


                ద రెమిడియల్ స్టూడెంట్   


        
            





                  ద రెమిడియల్ స్టూడెంట్

ఒక వైపు తల్లిదండ్రుల ఆకాంక్ష తనపైనే వారి ఆశలు

మరొక వైపు గురువుల బాధ తనకు మంచి భవిష్యత్ అందించాలనే తపన

చెక్కతో చేసిన కొవ్వొత్తి లాగ తన మెదడు

బురదలో చిక్కుకుపొయిన చేపలా

అటు నీళ్ళలోకి వెల్లలేక ఇటు నేల మీదకి వెళ్ళలేక

నడి సముద్రంలో మునిగిపోతూ తీరం చేరలేక

ఎండకు దగ్గరగా వానకు దూరంగా ఉంటూ

ప్రతి రోజూ బాధ పడేవాడే రెమిడియల్ స్టూడెంట్


ఎడారిలో చెప్పులులేకుండా నడిచిన గత సంవత్సరం

గొడుగు ఉన్నా ఎండలో నడవలేని ఈ సంవత్సరం

రెండింటి మధ్యలో ఒక గ్రహంలా శూన్యంలో వేలాడుతూ

చదివేది అర్ధంకాక ఫ్రెండ్స్ తో ఉండలేక

తనలో తానే నిందించుకుంటూ

తనకే తానంటే అసహ్యం కలిగేలా

ప్రతిరోజూ చీకటి అనే గదిలో ఉంటూ

తన జీవితంలో వెలుగు రావాలని వేచిచూస్తూ


ఎంత ప్రయత్నించినా చదవలేక,చదివినా మర్చిపోతూ

ఏం చేయాలో తోచక అయోమయ స్థితిలో ఉంటూ

అమాయకపు మొఖంతో,ఆనందంలేని నవ్వుతో

పరీక్షల్లో ప్రక్కవారి సహాయం ఆశిస్తూ

ఎవరోవస్తారు మనకేదో సహాయం అందిస్తారు అని

భ్రమించేవాడే     రెమిడియల్ స్టూడెంట్….


కాలం ప్రయాణంలో, మిత్రుల ఆనందంలో

తన ఆనందాన్ని వెతుక్కుంటాడు

తనలో పొంగే బాధ అనే సాగరఘోషకు సమాధానం చెప్పలేక

చదువు అనే అగ్నిని ఆర్పలేక

ఎలా అయినా తీరంచేరుకోవాలనే ఆకాంక్షతో

ప్రయత్నం వదలక నిత్యం ప్రయత్నిస్తూ


చివరికి విజయం పొందానని తెలిస్తే............


కట్ట తెగినవాగులా, ఉప్పొంగే జలపాతంలా

పంజరం వదిలిన పక్షిలా,గాలికెగిరిన గాలిపటంలా

తనలో వున్న ఆవేదనని ఒక్కసారిగా పడేస్తూ(వదిలేస్తూ)

జాలివైన ఆ కళ్ళనుండి ఆనందభాష్పాలు రాలుస్తూ...


ఆనంద సమయంలో పండగ చేసుకునేవాడే
రెమిడియల్ స్టూడెంట్….



తప్పులు అందరూ చేస్తారు. తప్పులు సరిదిద్దుకున్నవారు మనీషిగా మారతారు.
తప్పులు సరిదిద్దుకోనివారు మనిషిగానే మిగిలిపోతారు.
గతం ఎలా గడిచింది? అనేది మనకు అనవసరం ఎందుకంటే గతం తిరిగిరాదు(గతం గతః).భవిష్యత్ ఎలా వుంటుదనే మనం ఆలోచించాలి
భవిష్యత్ కోసం ఇష్టపడి కష్టపడతావో, లేక కష్టపడి వదిలేస్తావో.. అది నీ ఇష్టం.
                                                                
                                                          రచన
                                                                           బి.దుర్గబాబు





No comments:

Post a Comment

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...