నొప్పించేది మాత్రం ప్రేమతో బరువెక్కిన హృదయాన్నా..
వయ్యారాలకుపోయి కాంతి విరజిల్లే నగుమోము..
తలపించేది మాత్రం సూర్యాస్తమయ సమయాన్నా..
తేనెలొలుకు అదరాల పలుకుల కుసుమము..
మూగబొమ్మన్నది మాత్రం ప్రియమార పిలుచు గ్రీవాన్నా..
ఊసులేక ప్రాణం ఉసూరుమంటున్నదే..
ఏ పాడు కనుల దిష్టి తగెలెనో..
ఏ నిందమాట నింగి వినెనో..
కాటుక నిండిన కనుల కన్నీటికి కారణం నేనేనా?
- దున్శేవర్

No comments:
Post a Comment