నిన్ను నడిపిన నాన్నా? లేక
నిన్ను కన్న అమ్మా?
అర్ధం చేసుకునే అన్నా? లేక
అవసరాన్ని అర్థం చేసుకునే అక్కా?
ఎవరో తెలియదు..ఎందుకంత నమ్మాలి?
ఫ్రెండ్ ముసుగులో జరగని మోసం ఏది?
నమ్మకంతో మోసపోని పరిస్థితి ఏది?
భయంతో ఆడుకోని మతం ఏది?
మతం ముసుగులో జరగని నేరం ఏది?
ఎంత జరిగినా..ఏం జరిగినా మగువలపైనే..
కావల్సినవాళ్ళే కాటేసే కలియుగంలో ఉన్నాం,
కేరింగ్లో కన్నింగ్ను అర్ధం చేసుకోలేని సమాజంలో బతుకుతున్నాం.
కాస్త జాగ్రత్త...
స్త్రీ కాయం సృష్టికి మూలం,
బలవంతంగా లాక్కునే కాయం కాకూడదు.
స్వార్ధం కోసం సృష్టినే నాశనం చేసే మృగాలు ఉన్నాయి,
మగువా..కాస్త జాగ్రత్త..
-దున్శేవర్
No comments:
Post a Comment